సొగసు చూడతరమా.. బికినీలో లక్ష్మీరాయ్
ఇటీవల తెలుగులో మెగా బ్రదర్స్ సరసన ఐటం సాంగ్స్ లో రెచ్చిపోయిన లక్ష్మీరాయ్... ఇప్పుడు బికినీ సోకులతో మైమరపిస్తోంది. ఇప్పటివరకూ చిట్టిపొట్టి దుస్తుల్లో ఎన్నోసార్లు అందాలారబోసిన ఈ వయ్యారి.. బికినీలో మెరవడం మాత్రం ఇదే తొలిసారి. ఈ విషయాన్నే చెపుతూ స్విమ్మింగ్ పూల్ పక్కన టూ పీస్ బికినీలో సొగసులారబోస్తున్న ఫొటోను ట్వీట్ చేసింది లక్ష్మీరాయ్.
బాలీవుడ్ మూవీ 'జూలీ-2'కు సంబంధించిన స్టిల్ ఇది. గతంలో 'జూలీ' సినిమాలో నేహా ధూపియా తన అందచందాలతో ఆకట్టుకోగా... ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీలో అంతకు మించి రెచ్చిపోయిందట లక్ష్మీరాయ్. దీపక్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్న ఈ శృంగార చిత్రంలో స్టోరీ డిమాండ్ మేరకు హాట్ సీన్స్ లో ఏమాత్రం మొహమాట పడకుండా నటించిందట లక్ష్మీరాయ్. మరి... పోస్టరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని 'జూలీ-2'పై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.