ట్రైలర్ టాక్... ‘బాహుబలి.. ది కంక్లూజన్’
ప్రేక్షకులు ఎప్పెడెప్పుడా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ‘బాహుబలి.. ది కంక్లూజన్’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ను ప్రారంభించిన రాజమౌళి... కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను తీర్చిదిద్దాడు. శివగామి, కట్టప్ప పాత్రల తీరుతెన్నులను.. వారి ప్రవర్తన వెనుకున్న సీక్రెట్స్ ను ఈ సినిమాలో రివీల్ చేయబోతున్నట్టుగా ట్రైలర్ ను కట్ చేయించాడు రాజమౌళి.
బాహబాహీగా తలపడుతున్న ప్రభాస్, రానా ల మధ్య పోరాట సన్నివేశాలు ట్రైలర్ లో హైలెట్ గా నిలచాయి. ఫస్ట్ మూవీ ట్రైలర్ లో తమన్నా అందాలను ఫోకస్ చేయగా... సీక్వెల్ ట్రైలర్ లో అనుష్కను స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇటీవల బొద్దుగా మారిన అనుష్క.. గ్రాఫిక్ మాయాజాలతో సన్నజాజి తీగలా మెరవడం విశేషం. అనుష్క యుద్ధ సన్నివేశాలతో పాటు ప్రభాస్-అనుష్కల రొమాన్స్ రసవత్తరంగా సాగింది. ఇక 'బాహుబలి'లో ఎమోషన్ ను మించి గ్లాఫిక్స్ సీన్స్ ఉండగా.. తాజా చిత్రంలో ఈ రెండు సమాన స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.