HeadLines

ప్రభాస్ ఫేవరేట్ రాజమౌళి కాదు.. మరెవరు..?


రైజింగ్ లో ఉన్న హీరో కూడా ఓ డైరెక్టర్ ను నమ్మి ఐదేళ్లు ఒకే సినిమాకు అంకితం అవడు. కానీ.. రాజమౌళిపై ఉన్న నమ్మకంతో 'బాహుబలి' సిరీస్ పై భరోసా ఉంచాడు ప్రభాస్. అంతలా రాజమౌళిని విశ్వసించి.. 'బాహుబలి' ప్రతీ ఇంటర్వ్యూలోనూ జక్కన్నను ఆకాశానికెత్తిన ప్రభాస్ కు.. ఫేవరెట్ డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదట. ఈ మాట ఇంకెంవరో అంటే నమ్మలేం కానీ.. స్వయంగా ప్రభాసే ఈ విషయం చెపితే నమ్మాల్సొచ్చింది.

ప్రభాస్ కు ఫేవరేట్ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారట. అందులో ఒకరు మణిరత్నం కాగా.. మరొకరు బాపు. ఈ ఇద్దరు దర్శకులు అంటే తనకెంతో ఇష్టం అని.. అయితే ఇద్దరిలో ఒకరి పేరు చెప్పమంటే ఖచ్చితంగా మణిరత్నం పేరే చెపుతానని.. తాను మణిరత్నంకు అంతలా వీరాభిమానినని అన్నాడు ప్రభాస్.

తమిళులకు దగ్గరయ్యేందుకేనా..?

ఏప్రిల్-9న జరిగిన 'బాహుబలి-2' తమిళ వెర్షన్ ఆడియో వేడుకలో.. తన ఫేవరేట్ డైరెక్టర్ గురించి చెప్పాడు ప్రభాస్. పైగా ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసునన్నాడు. పక్కన జక్కన్నను పెట్టుకుని ప్రభాస్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే.. బాహుబలి – 2 రిలీజ్ దృష్ట్యా... ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండే తమిళ తంబీలను తనవైపుకు తిప్పుకునేందుకు తమిళుడైన మణిరత్నం పేరు చెప్పి ఉండచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.