HeadLines

బాలయ్యకు ఎన్టీఆర్ పాద నమస్కారం..


నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు నటవారసులు వచ్చారు. ఎంతమంది ఎంట్రీ ఇచ్చినా... రెండో తరంలో బాలకృష్ణ, మూడో తరంలో జూ.ఎన్టీఆర్ స్టార్ రేంజ్ ను అందుకుని రాణిస్తున్నారు. ఓ వైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తుండగా.. మరోవైపు నాలుగోతరం నుంచి హరికృష్ణ మనవడు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇటీవల విశాఖలో టీఎస్ఆర్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో దివంగత జానకిరామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్ బాలల చిత్రం "దానవీర శూరకర్ణ"కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును అందుకునే సమయంలో మాస్టర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ పాదాలకు నమస్కరించి పెద్దలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. బాలయ్య కూడా తన అన్న మనవడిని ఆప్యాయంగా ఆశీర్వదించాడు.