సోనియా, మన్మోహన్ లు అనుమతిస్తేనే ఆ సినిమా
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనుపమ్ ఖేర్ టైటిల్ రోల్ లో విజయ్ రత్నాకర్ దర్శకత్వంలో హన్సల్ మెహతా ఈ సినిమాను నిర్మించనున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ ను.. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ ఫొటోస్ హైలెట్ అయ్యేలా డిజైన్ చేశారు.
రాజకీయ నేతల ప్రస్తావన ఉన్న సినిమా కావడంతో.. ఫ్యూచర్ లో వీరి నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో మన్మోహన్, సోనియా నుంచి తమకు ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ ఎన్వోసీ తీసుకు రావాల్సిందిగా సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ పహ్లజ్ నిహ్లానీ ఆదేశించారు. సో... వారి నుంచి ఎన్వోసీ వస్తేనే ఈ సినిమా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.