HeadLines

ఎన్టీఆరే కాదు.. రానా కూడా..!


బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా మెప్పించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నాగార్జున, చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో బుల్లితెరపై సందడి చేయగా... హిందీలో పాప్యులర్ అయిన 'బిగ్ బాస్' షో .. తెలుగు వెర్షన్ కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో రానా కూడా మరో టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరించానున్నాడట.

ఆల్రెడీ ఐఫా వంటి అవార్డ్స్ వేడుకల్లో వ్యాఖ్యాతగా అదరగొట్టేసిన రానా.. ఇప్పుడు ఓ టీవీషోను హోస్ట్ చేస్తున్నాడట. ఆల్రెడీ ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోందట. సినీ సెలబ్రిటీల జీవిత విశేషాల గురించి మునుపెన్నడూ చూడని కొత్త థీమ్ తో ఈ టీవీ షో ఉండనుందట. మరికొద్ది నెలల్లో ఈ షో టెలికాస్ట్ అవనుందని తెలుస్తుంది.