HeadLines

మహేశ్ బాబు 'స్పైడర్' టీజర్         మహేశ్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'స్పైడర్' చిత్రం టీజర్ విడుదలైంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే-31న విడుదల కావాల్సిన ఈ టీజర్.. దాసరి కన్నుమూత కారణంగా ఈరోజున విడుదలైంది. 'స్పైడర్' మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే.. ఈ టీజర్ లో రోబోటిక్ స్పైడర్ ను పరిచయం చేశారు.

        మహేశ్ బిజీగా వర్క్ చేసుకుంటుంటే.. స్పైడర్ భుజం మీదుగా పాకుతూ టేబుల్ పైకి రాగా.. డిస్ట్రబ్ చేయవద్దన్నట్టుగా " ష్ .." అని మహేశ్ అనడాన్ని టీజర్ గా కట్ చేశారు. శత్రువులకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సంపాదించడానికి సినిమాలో మహేశ్ ఈ స్పైడర్ ను వాడతాడని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు టీజర్ లో క్లారిటీ ఇచ్చారు.