HeadLines

హాలీవుడ్ నటుడితో కలసి నితిన్


నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. మరో రెండు నెలల పాటు అక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సినిమాలో మేఘ ఆకాష్ నితిన్ కు జంటగా నటిస్తుండగా.. ఇప్పుడో హాలీవుడ్ స్టార్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యాడు.

పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన డాన్ బిల్జరియాన్ అనే నటుడు 'లై' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బిల్జరియాన్ తమ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని.. లొకేషన్ కు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేశాడు నితిన్. ఈ ఫొటోలో హలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు.