HeadLines

రంజాన్ కు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్



గతేడాది ‘జనతా గ్యారేజ్‘ టీజర్ తో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపన ఎన్టీఆర్.. ఈ ఏడాది కూడా ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించాడు. ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జై లవకుశ‘ సినిమా రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ 21న విడుదల చేయబోతున్నట్టు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను నిర్మిస్తోన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

జులై ఫస్ట్ వీక్ లో ‘జై లవకుశ‘ టీజర్ ను విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన టీమ్.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ‘జనతా గ్యారేజ్‘ సెంటిమెంట్ దృష్ట్యా ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారనే ప్రచారం జరిగినప్పటికీ.. సెప్టెంబర్21 ఈ సినిమాను విడుదల చేస్తుండడంతో దసరా బరిలో ఎన్టీఆర్ చేరినట్టయింది.