ఎంజీఆర్ గా సత్యరాజ్..?
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎంజీఆర్ జీవితంపై ఇప్పుడో సినిమా రూపొందబోతోంది. రమణ కమ్యూనికేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూపొందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఎంజీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న డైరెక్టర్ బాలకృష్ణన్... ఎంజీఆర్ పాత్రకు నటుడు సత్యరాజ్ సరిపోతారని భావిస్తున్నాడట. త్వరలోనే సత్యరాజ్ ను కలిసి ఏ విషయంపై చర్చించనున్నారు. మరి ఎంజీఆర్ గా నటించేందుకు సత్యరాజ్ అంగీకరిస్తారో, లేదో..?