HeadLines

చివరి షెడ్యూల్ కు 'పైసా వసూల్' సిద్ధం



బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్' సినిమా..  చివరి షెడ్యూల్ షూటింగ్ జూలై 3వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరగబోతోంది. 28 వరకూ జరగనున్న ఈ చిత్రీకరణతో షూటింగ్ పూర్తి కానుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆరంభించి.. దసరా కానుకగా సెప్టెంబర్-29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా మేజర్ పార్టు షూటింగు పోర్చుగల్ లో జరగగా... ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. శ్రియ, ముస్కాన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తుండగా భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల కాగా... అభిమానులు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.