HeadLines

ట్రైలర్ తో దుమ్మురేపుతోన్న ధనుష్ 'వీఐపీ-2'



తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ సాధించిన ధనుష్ 'విఐపి' (రఘువరన్ బీటెక్) సినిమాకు సీక్వెల్ గా 'వీఐపీ-2' తెరకెక్కుతోంది. కాజోల్ నెగటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు ధనుష్ మరదలు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. రీసెంట్ గా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.


"నీ సొంత కంపెనీకి నువ్ బాస్ అనిపించుకోవడం కన్నా, నా కంపెనీలో ఎంప్లాయ్ గానే నీకు గొప్ప స్టేటస్ దక్కుతుంది" అని కాజోల్ కౌంటర్ ఇస్తే, "మేడం .. నేను పులికి తోకలా ఉండటం కన్నా పిల్లికి తలగా ఉండటానికే ఇష్టపడతాను" అంటూ ధనుష్ ఇచ్చిన రిటర్న్ కౌంటర్ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. 'పెళ్లిచూపులు' ఫేం రీతూవర్మ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించగా.. చాలావరకూ 'వీఐపీ'లో నటించిన నటీనటులనే ఈ సినిమాలోనూ రిపీట్ చేశారు. సీక్వెల్ సినిమా కావడంతో 'వీఐపీ-2'పై అంచనాలు భారీగానే ఉన్నాయి.