HeadLines

సుకుమార్ మరో శిష్యుడు మెగాఫోన్ పట్టాడు


‘అందాల రాక్షసి’ సినిమాతో పరిచయమైన నవీన్ చంద్ర.. హీరోగా సక్సెస్ అయ్యేందుకు పట్టు వదలని విక్రమార్కుడులా ట్రై చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన 'నేను లోకల్'లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన నవీన్ చంద్ర.. ఇప్పుడు మరోసారి సోలో హీరోగా అదృష్టం పరిక్షించుకుంటున్నాడు.

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసిన అజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సుకుమార్ చేతుల మీదుగా విడుదల చేయించారు. టైటిల్ కు తగ్గట్టే మోషన్ పోస్టర్ ను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించానంటున్నాడు అజయ్. మరి.. నవీన్ చంద్రకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూద్దాం.