HeadLines

నితిన్ ‘లై‘ టీజర్ వచ్చేస్తోంది..!



‘అ..ఆ..‘ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నితిన్ నుంచి రాబోతున్న చిత్రం ‘లై‘. ‘కృష్ణ గాడి వీరప్రేమ గాధ‘ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతో మేఘా ఆకాష్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. యాక్షన్ కింగ్ అర్జున్ నెగటివ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించిన ‘లై‘ యూనిట్... ఈ నెల 11న ఈ మూవీ ఫస్ట్ టీజర్ ను విడుదల చేయబోతోంది.