HeadLines

రమ్యకృష్ణ.. రాజకీయాల్లోకి రానుందా..?


           'నరసింహా' సినిమాలోని నీలాంబరి క్యారెక్టర్ తర్వాత.. ఆ స్థాయిలో రమ్యకృష్ణకు మరో పవర్ ఫుల్ రోల్ దక్కడం కష్టమనుకున్నారంతా. కానీ.. 'బాహుబలి'లోని శివగామి క్యారెక్టర్... అందుకు పదింతల పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీంతో.. ఇప్పుడు రమ్యకృష్ణను ఈ తరహా పాత్రల కోసం సంప్రదించే దర్శకనిర్మాతల సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో నారా రోహిత్ సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్యకృష్ణ కనిపించబోతోందట.

         నారా రోహిత్ హీరోగా నవీన్ మల్లెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను శరచ్చంద్రిక విజనరీ సంస్థ నిర్మిస్తోంది. రోహిత్ సరికొత్త గెటప్ లో కనిపించనున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్యకృష్ణ నటిస్తోందట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్.. సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెపుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా టీజర్ ను జులై-25న రోహిత్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు.