HeadLines

చెన్నయ్ లో బాలకృష్ణ సినిమా ఆడియో రిలీజ్



ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పైసా వసూల్' సినిమాతో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. దసరా కానుకగా సెప్టెంబర్-29న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ కెరీర్ లో 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ఇప్పుడు తమిళంలో విడుదలకి సిద్ధమవుతోంది.

 ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తమిళ వెర్షన్ ఆడియో వేడుక ఈనెల 10న చెన్నయ్ లో గ్రాండ్ గా జరగబోతోంది. బాలకృష్ణతో పాటు క్రిష్, శ్రియ, తమిళ నటులు ప్రభు, విశాల్, జయం రవి, కార్తీక్, నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 'బాహుబలి' సిరీస్ ఘన విజయంతో తమిళనాట తెలుగు హిస్టారికల్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. నిర్మాత నరేంద్ర సుమారు మూడు వందల థియేటర్స్ లో 'శాతకర్ణి' చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. బాలకృష్ణ స్వయంగా తమిళ వెర్షన్ ప్రమోషన్ లో పాల్గొననుండటం విశేషం.