వారం తేడాతో వారాహి నుంచి రెండు
ఓ వైపు 'లెజెండ్' వంటి పెద్ద చిత్రాలు.. మరోవైపు 'ఈగ' వంటి ప్రయోగాత్మక సినిమాలు.. ఇంకోవైపు 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' తరహా కొత్త తరహా చిన్న చిత్రాలతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు నిర్మాత సాయి కొర్రపాటి. వారాహి చలనచిత్రం బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తుండడంతో పాటు.. డిస్టిబ్యూటర్ గానూ వ్యవహరిస్తోన్న సాయి.. ఈ నెలలో వారం తేడాతో రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారు.
నందు మల్లెల దర్శకత్వంలో డే డ్రీమ్స్ సంస్థ నిర్మించిన ‘రెండు రెళ్ళు ఆరు’ సినిమా కథ నచ్చడంతో.. ఈ సినిమాకు తానే సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఈ నెల 8న విడుదల చేస్తున్నారు సాయి కొర్రపాటి. మరోవైపు.. వారాహి సంస్థ నిర్మాణంలో జగపతిబాబు హీరోగా వాసు పరిమి దర్శకత్వంలో తెరకెక్కిన 'పటేల్ సార్' ఈనెల 14న విడుదల కాబోతోంది. చిన్న సినిమాలే అయినప్పటికీ.. ఈ రెండు సినిమాల కాన్సెప్ట్స్ మాత్రం వైవిధ్యంగా ఉన్నాయి. వైవిద్యం కోసం తపించే వారాహి సంస్థకు ఈ రెండు సినిమాలు విజయాలను అందిస్తాయని ఆశిద్దాం..!