వరంగల్ లో 'ఫిదా' బ్యూటీతో నాని బైక్ రైట్
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి.. ప్రస్తుతం నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ జంటగా వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్ అబ్బాయి) సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం వరంగల్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
షూటింగ్ లో భాగంగా నాని, సాయిపల్లవి బైక్ పై షికారుకెళ్తున్న సీన్స్ ను బుధవారం హన్మకొండలో చిత్రీకరించారు. స్థానిక గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో ఈ షూటింగ్ జరుగుతోంది. దీంతో స్థానికులు వీరిని చూసేందుకు ఎగబడ్డారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భూమిక, విజయ్, సీనియర్ నరేష్, ఆమని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్-22న ఈ సినిమా విడుదల కాబోతోంది.