HeadLines

'జై లవ కుశ' ఆడియో రిలీజ్ వేడుక రద్దు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ'. దసరా కానుకగా సెప్టెంబర్-21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఆడియో వేడుకను ఈనెల 3న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించాలని భావించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ వేడుక రద్దయింది. చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఓ వైపు హైదరాబాద్ లో వర్షాలు, మరోవైపు గణేశ్ మండపాల కోలాహలం, నిమజ్ఞనం దృష్ట్యా.. అభిమానులను ఇబ్బందులకు గురవుతారని భావించి.. ఆడియో వేడుకను రద్దు చేస్తున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. అయితే.. సెప్టెంబర్-3నే ఈ సినిమా ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తామని.. అభిమానుల కోసం సెప్టెంబర్-10న గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.