HeadLines

ట్రైలర్ టాక్: ఓటు విలువ తెలియజేప్పే ‘న్యూటన్’




‘షహిద్‘ వంటి చిత్రాలతో నటుడిగా మెప్పించిన బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ నటించిన తాజా చిత్రం ‘న్యూటన్’. సెప్టెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ను బట్టి చూస్తే.. నిజాయితీ పరుడైన న్యూటన్ అనే యువకుడి కథే ఈ సినిమాగా తెలుస్తోంది. పెళ్లిచూపుల్లో అమ్మాయికి 16 ఏళ్లు అని తెలిసి వెళ్లిపోయేంత హానెస్ట్ పర్సన్ అయిన యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే కాస్త చూసి చూడనట్టు పోవాలి అనే సూత్రాలకు పూర్తి విరుద్ధం న్యూటన్.

నిజాయితీ పరుడైన న్యూటన్.. ఓసారి పోలింగ్ బూత్ ఆఫీసర్ గా ఎలక్షన్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. అదికూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఓ మారుమూల గ్రామంలో. ఓటింగ్ ను అడ్డుకునే మావోయిస్టులు, నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ మరియు పోలింగ్ సిబ్బంది నడుమ ఓటు విలువ తెలియని గిరిజనులను జాగృతం చేసి తన పరిధిలో పోలింగ్ సజావుగా సాగేందుకు హీరో ఏం చేశాడన్నది సినిమా పూర్తి కథాంశం. ఎంతో ఇంటెన్స్ ఉన్న ఈ కథను కామెడీ కలగలిపి తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతోంది.