'అవతార్' సీక్వెల్ లో 'టైటానికి' బ్యూటీ
వెండితెర అద్భుతంగా చెప్పుకునే 'అవతార్' చిత్రం.. ఇప్పటివరకూ హాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లు సాదించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి నాలుగు సీక్వెల్స్ తెరకెక్కించడంలో బిజీ అయ్యాడు దర్శకుడు జేమ్స్ కామరూన్. ఇప్పటికే వీటి రిలీజ్ డేట్స్ ను కూడా కామరూన్ ప్రకటించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాఆలో 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్ నటించబోతోందట.
'అవతార్' సీక్వెల్ లో కీలకమైన రోనల్ అనే క్యారెక్టర్ కు కేట్ విన్ స్లెట్ ను ఎంపిక చేశాడట జేమ్స్ కామరూన్. నిజానికి ప్రస్తుతం కేట్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. కామరూన్ అడగడంతో కాదనలేకపోయిందట. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన 'టైటానిక్' సినిమా కేట్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాప్యులారిటీ తెచ్చిందో తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్.. 20 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుండటం విశేషం. కాకపోతే.. కేట్ పోషిస్తోన్న రోనల్ పాత్ర కొన్ని సీక్వెల్స్ కే పరిమితం అవుతుందా.. లేక నాలుగింటిలోనూ ఉంటుందా అనే విషయంపై కామరూన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.