విశాల్ 'డిటెక్టివ్' ట్రైలర్ విడుదల
కోలీవుడ్ యాక్షన్ హీరోగా విశాల్ కథానాయకుడుగా మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళనాట విడుదలై విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాను.. ప్రముఖ పంపిణీదారుడు జి.హరి.. తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
షెర్లాక్ హోమ్స్ తరహాలో ఉండే డిటెక్టివ్ గా విశాల్ ఈ సినిమాలో నటించాడు. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీని చేధించే ఈ డిటెక్టివ్ కు జంటగా అనూ ఇమ్మాన్యుయల్ నటిస్తోంది. విశాల్ కు అసిస్టెంట్ గా స్నేహ భర్త ప్రసన్న నటించగా.. ఆండ్రియా నెగటివ్ రోల్ లో మెరసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే తమిళంలో ఘనవిజయాన్ని అందుకుంది.
కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాష్ ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: అరోల్ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్.