మార్చి నుంచి బన్నీ కొత్త సినిమా
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'నా పేరు సూర్య' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా కంటే ముందే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాకు అంగీకరించిన విషయం తెలసిందే. గత ఏడాది చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాతో బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందబోయే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈలోపు 'నా పేరు సూర్య' షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు అల్లు అర్జున్.