HeadLines

పిరియాడికల్ లవ్ స్టోరీలో ప్రభాస్

‘బాహుబలి’ సిరీస్ భారీ విజయం తర్వాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అయితే.. ప్రభాస్ మాత్రం తన గత కమిట్మెంట్స్ పూర్తయ్యాకే కొత్త ప్రాజెక్ట్స్ మొదలెడతానంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే 'సాహో' మొదలెట్టిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో నటించనున్నాడు.

'సాహో' యాక్షన్ మూవీ కాగా.. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమా మాత్రం ప్రేమకథ అని తెలుస్తోంది. ఇందులో మరో సర్ప్రైజ్ ఉందట. 1960-70 నేపథ్యంలో ఈ లవ్ స్టోరీ ఉండనుందట. పైగా యూరప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' 1985 నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ఇప్పుడు ప్రభాస్ కూడా పిరియాడికల్ మూవీపై దృష్టి సారించబోతున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది.