HeadLines

మిల్కీ బ్యూటీ.. డిస్కౌంట్స్ ఇస్తోందా..?

'బాహుబలి' వంటి భారీ చిత్రంలో నటించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన 'బాహుబలి-2'లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించింది తమన్నా. మరోవైపు.. తమన్నా నటించిన 'అభినేత్రి' వంటి చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలో.. కొత్త సినిమాల విషయంలో పారితోషికం తగ్గించేసిందట మిల్కీబ్యూటీ.

ఇటీవల 'జై లవకుశ' చిత్రం ఐటం సాంగ్ లో మెరసిన తమన్నా.. ఈ మూవీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ సరసన అవకాశం అందుకుంది. మరోవైపు.. 'క్వీన్' సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోంది. ఐటం సాంగ్ కు రూ.60 లక్షలు అందుకున్న తమన్నా.. హీరోయిన్ గా నటించేందుకు కూడా డిస్కౌంట్ ఇస్తోందట. కాస్త పేరున్న హీరోయిన్ తక్కువ పారితోషికంలో లభిస్తుండడంతో.. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ అంతా మిల్కీ బ్యూటీ వైపు చూస్తున్నారట.