HeadLines

మెగాఫ్యామిలీ హీరోతో 'ఘాజీ' దర్శకుడి చిత్రం


మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎక్కువమంది మాస్ హీరోల్లా మెప్పించేందుకే ప్రయత్నిస్తున్నారు. కానీ.. వీరిలో వరుణ్ తేజ్ రూటే సెపరేటు. వైవిధ్యభరిత చిత్రాలతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్.. రీసెంట్ గా 'ఫిదా'తో ఓ బడా హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' అనే సినిమాలో నటిస్తున్న ఈ యువహీరో.. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యాడట.

తొలిచిత్రంతోనే 'ఘాజీ' వంటి క్లిష్టమైన సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేసి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన రెండో సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న సంకల్ప్.. ఇటీవల వరుణ్ తేజ్ ను కలసి కథ వినిపించాడట. వైవిధ్య కోసం తపించే వరుణ్ తేజ్.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కథ, జానర్ ఏమిటో ఇంకా తెలియరాలేదు కానీ.. 'ఘాజీ' సినిమాను నిర్మించినీ పీవీపీ సంస్థే ఈ సినిమాను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.