షారుక్ ఖాన్ తో హరీష్ శంకర్
తెలుగులో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు హరీష్ శంకర్... తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ను కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను ట్వీట్ చేస్తూ.. 'నా జీవితంలోనే మరిచిపోలేని సమయం, సంభాషణ' అంటూ ట్వీట్ చేశాడు హరీష్. అయితే.. షారూక్ ఖాన్ ను తాను ఎందుకు కలిశాడన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు హరీష్ శంకర్.
'డీజే దువ్వాడ జగన్నాథం' తర్వాత హరీష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడా అనే విషయంపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు. 'దాగుడు మూతలు' అనే లవ్ స్టోరీ ప్లాన్ చేసినప్పటికీ.. యువహీరోలెవరూ డేట్స్ ఇవ్వకపోవడంతో స్టార్ హీరోలతో కొత్త ప్రాజెక్ట్స్ కు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో పవన్ తో ఓ సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిక షారుఖ్ ను హరీష్ కలవడం సినీజనాల్లో ఆసక్తి రేపుతోంది.