అంగరంగవైభవంగా చైతూ- సమంత వివాహం
కొన్నేళ్లుగా కొనసాగుతోన్న నాగచైతన్య, సమంత ప్రేమకథకు.. శుక్రవారంతో శుభంకార్డు పడింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ప్రేమజంట ఒక్కటయ్యారు. గోవాలోని వెగాటర్ బీచ్ లోని డబ్ల్యూ హోటల్ లో ఈ వివాహం అంగరంగవైభవంగా జరిగింది. సరిగ్గా రాత్రి 11:52 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. అతిథుల ఆనందోత్సాహాల నడుమ సమంత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేశాడు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను నాగార్జున, సమంతతో పాటు పలువురు సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబాలకు చెందిన బంధుమిత్రులతో పాటు అతికొద్దిమంది సినీప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ కొత్తజంటకు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వీరి వివాహం జరగనుండగా.. అతి త్వరలో హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.