హాకీలో తాప్సీ ప్రత్యేక శిక్షణ.. బయోపిక్ కోసం
'జుడ్వా-2' సినిమాతో బాలీవుడ్ లో మరో విజయాన్ని అందుకున్న తాప్సీ.. ప్రస్తుతం హాకీ ఆటలో శిక్షణ తీసుకుంటోంది. ప్రముఖ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా కోసమే ప్రస్తుతం హాకీ ప్రాక్టీస్ చేస్తోంది తాప్సీ.
సందీప్ సింగ్ పాత్రను దిల్జీత్ సింగ్ పోషిస్తుండగా.. అతని ప్రియురాలిగా తాప్సీ నటించబోతోంది. సందీప్ సింగ్ ప్రియురాలు కూడా హాకీ ప్లేయర్ కావడంతో ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం తాప్సీ హాకీలో శిక్షణ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది తాప్సీ. ఈ బయోపిక్ తో బాలీవుడ్ లో తనకు మరో సక్సెస్ ఖాయమనే నమ్మకం వ్యక్తం చేస్తోంది ఈ కర్లీ హెయిర్ బ్యూటీ.
When I saw my father’s hockey medals,never thought the dormant genes in me will b of any use,until now! #FlickerSingh #HockeyTrainingBegins pic.twitter.com/tBE2H9PKum— taapsee pannu (@taapsee) October 4, 2017