HeadLines

అఖిల్ 'హలో'లో అజయ్ ఇలా..!



అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హలో' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మరోవైపు డిసెంబర్22న విడుదల అంటూ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. దీంతో.. ప్రమోషన్ హడావుడి పెంచేసిన 'హలో' టీమ్... ఇప్పటికే ఓ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడిక సినిమాలోని ఒక్కో కీలకపాత్రను పరిచయం చేస్తున్నారు.

'హలో' చిత్రంలో అజయ్ రిషి అనే పాత్రలో నటిస్తుండగా.. ఇందుకు సంబంధించిన లుక్ ను ఇప్పుడు రివీల్ చేశారు. రిషికి హలో చెప్పండి అంటూ.. స్టైలిష్ గెటప్ లో అజయ్ కనిపిస్తోన్న ఫొటోను విడుదల చేశారు. 'ఇష్క్', '24' చిత్రాల్లో అజయ్ కు అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఇచ్చిన విక్రమ్ కుమార్.. 'హలో' సినిమాలోనూ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.