HeadLines

బన్నీ సింగపూర్ టూర్ వెనకున్న రీజన్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సింగపూర్ ట్రిప్ లో ఉన్నాడు. అలాగని తన తాజా చిత్రం 'నా పేరు సూర్య' కోసం బన్నీ సింగపూర్ వెళ్లలేదు. ఫ్యామిలీతో కలసి సరదాగా గడిపేందుకు ఫారిన్ టూర్ ప్లాన్ చేశాడట. అదికూడా తన చిన్నారి కూతురు అర్హ కోసమట.

సోషల్ మీడియాలో తన సినిమా సంగతులతో పాటు పర్సనల్ ఫొటోస్ ను పోస్ట్ చేసే బన్నీ.. ఇటీవల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేశాడు. ఇందులో తన మొదట బన్నీ పోస్ట్ చేసింది అర్హ ఫొటోనే. అర్హకు బర్త్ డే విశెష్ తెలుపుతూ ఫస్ట్ పోస్ట్ పెట్టిన బన్నీ.. ఈ చిన్నారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు సంబంధించిన మరో పోస్ట్ చేశాడు. సింగపూర్ లోని మరీనా బే వద్ద రాత్రివేళలో జరిగిన ఫౌంటెన్ షో ఫొటో అది. సో.. కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్ ను సింగపూర్ లో ప్లాన్ చేశాడు బన్నీ.