HeadLines

వెంకటేశ్ కు బావగా రాజశేఖర్



వెంకటేశ్, రానా కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందు తేజ దర్శకత్వంలో వెంకీ నటించబోయే చిత్రం కూడా మల్టీస్టారరే అని తెలుస్తోంది. వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్-13 నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే..ఈ మూవీలోని కీలక పాత్రల కోసం మాధవన్, సుమంత్, నారా రోహిత్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేశారనే విషయం అటుంచితే.. మరో కీలకపాత్ర కోసం రాజశేఖర్ తో సంప్రదింపులు జరుగుతున్నాయట.

వెంకటేశ్ కు బావగా నటించాల్సిన క్యారెక్టర్ కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నారట. ఆమధ్య విలన్ రోల్స్ తో పాటుగా క్యారెక్టర్ రోల్స్ కు కూడా సిద్ధమన్న రాజశేఖర్.. రీసెంట్ గా 'గరుడవేగ' సినిమాతో చాన్నాళ్ల తర్వాత హీరోగా మెప్పించాడు. ఈ క్రమంలో.. వెంకీ-తేజ సినిమాకు అంగీకరిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల రాజశేఖర్ 'గరుడవేగ' సినిమాకు వెంకటేశ్ కూడా ప్రచారం చేసి పెట్టాడు కనుక ఈ సినిమాకు రాజశేఖర్ సైన్ చేస్తే మాత్రం.. ఈ న్యూ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుబూతిని కలిగించడం ఖాయం.