చైతు-సమంత చేతుల మీదుగా సుమంత్ మూవీ ట్రైలర్
సుమంత్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘మళ్ళీ రావా’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. ఇటీవల విడుదలైన టిజర్ కు మంచి స్పందన లభిస్తుండగా.. ట్రైలర్ ను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు.
నాగచైతన్య, సమంత కలసి ఈ ట్రైలర్ ను విడుదల చేయనుండటం విశేషం.ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా.. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ట్రై చేస్తోన్న సుమంత్ కు.. ఈ సినిమాతోనే హిట్ లభిస్తుందేమో చూడాలి..!
The theatrical trailer of #MalliRaava to be released online by the newly weds @chay_akkineni and @Samanthaprabhu2 tomorrow, Nov 30, at 9am. Stay tuned for this one. It'll get you, trust us!— Sumanth (@iSumanth) November 29, 2017