HeadLines

హిస్టారికల్ మూవీలో సన్నీ లియోన్

నీలిచిత్రాలకు టాటా చెప్పి బాలీవుడ్ హీరోయిన్ గా కుదురుకున్న సన్నీలియోన్ కు.. దక్షిణాది నుంచి మాత్రం ఎక్కువగా ఐటం సాంగ్ అవకాశాలే వస్తున్నాయి. బాలీవుడ్ లోనూ ఐటం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది సన్నీ. ఈ క్రమంలో సన్నీలియోన్ కథానాయికగా ఇప్పుడో హిస్టారికల్ మూవీ తెరకెక్కబోతుండటం విశేషం.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్టీవ్స్ కార్నర్ బ్యానర్ పై పోన్స్ స్టిఫెన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ చారిత్రక చిత్రానికి  తమిళ దర్శకుడు వి.సి.వడివుడయన్ దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాలో నవదీప్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారట. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే కత్తియుద్ధం, గుర్రపు స్వారీ2 ప్రాక్టీస్ చేస్తోంది ఈ మాజీ పోర్న్ స్టార్.