బాలకృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందట. ప్రస్తుతం 'జై సింహా' సినిమా చిత్రీకరణలో ఉన్న బాలకృష్ణ.. మరోవైపు 'ఎన్టీఆర్' బయోపిక్ కు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలసిందే. అయితే.. 'ఎన్టీఆర్' సినిమాకు దర్శకత్వం వహించాల్సిన తేజ.. డిసెంబర్ నుంచి వెంకటేశ్ సినిమాతో బిజీ అవనున్నాడు. దీంతో.. ఈ గ్యాప్ లో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాను పూర్తి చేయనున్నాడట బాలకృష్ణ. వీరిద్దరి కలయికలో గతంలో 'టాప్ హీరో' అనే సినిమా రాగా.. 23 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవుతోంది.