HeadLines

'గరుడ వేగ' డైరెక్టర్ ను నితిన్ పట్టేశాడు


రాజశేఖర్ హీరోగా వచ్చిన 'పిఎస్వి గరుడవేగ' చిత్రం హిట్ టాక్ తో బాక్సాపీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడిదేనని హీరో రాజశేఖర్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో... సినిమా విడుదలై వారం తిరక్కముందే.. యువహీరో నితిన్ నుంచి ఆఫర్ అందుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నితిన్.

తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించబోతున్నట్టు నితిన్ ట్విట్ చేశాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ నటిస్తుండగా.. పుల్లెల గోపీచంద్ బయోపిక్ పై ప్రవీణ్ సత్తారు వర్క్ చేస్తున్నాడు. గతంలో.. ‘చందమామ కథలు, గుంటూర్ టాకీస్’ చిత్రాలను ప్రవీణ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.