HeadLines

కంగ‌న కథానాయికగా మ‌రో బ‌యోపిక్‌..?



కొన్నాళ్లుగా బాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో.. కంగనా రనౌత్ ఓ బయోపిక్ లో నటించబోతోందట. ఒంటికాలితో ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందట. నేషణల్ వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ సిన్హాను 2011లో న‌డుస్తున్న రైలు నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో ఒక కాలు కోల్పీయినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఒంటికాలుతోనే ఎవ‌రెస్ట్‌ను అధిరోహించి ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచింది అరుణిమ.

అరుణిమ బయోపిక్ కు సంబంధించి... కంగ‌నా, కృతి స‌న‌న్‌లతో ప్రస్తుతం చర్చలు జరిగినప్పటికీ నిర్మాతలు కంగనకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'మణికర్ణిక'లో నటిస్తోన్న కంగన.. ఈ సినిమా పూర్తవగానే అరుణిమ బయోపిక్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఎవరనే విషయం ఇంకా తెలియరానప్పటికీ.. 60 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.