HeadLines

'గరుడవేగ'కు టికెట్స్ బుక్ చేసుకున్నా: రాజమౌళి


ఫ్యామిలీ మెంబర్స్ తో కలసి తరచుగా సినిమాలు చూస్తుండే రాజమౌళి.. చూసి చూడగానే ఆయా సినిమాలను ప్రోత్సహించేలా ట్వీట్స్ పెడుతుంటాడు. రాజమౌళి చూపు.. ఈ వారం విడుదలై సక్సెస్ టాక్ అందుకున్న రాజశేఖర్ సినిమా 'పి.ఎస్.వి. గరుడవేగ'పైనా పడింది. కాకపోతే.. ఇంకా ఆ సినిమాను చూడలేదట రాజమౌళి. తన ట్వీట్ లో సినిమాకు సక్సెస్ టాక్ పట్ల యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపిన జక్కన్న ఆదివారం షోకు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. జక్కన్న ట్వీట్ కు స్పందించిన రాజశేఖర్.. 'మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి' అంటూ ట్వీట్ చేశాడు.