HeadLines

'సాహో' సెట్‌లో అలాంటివి నిషేదం


స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన షూటింగ్ విజువల్స్ లీక్ అవుతుండటం.. కోట్ల రూపాయల వ్యయంతో సినిమాలు చేస్తోన్న ఫిల్మ్ మేకర్స్ కు తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ విషయంలో 'సాహో' నిర్మాతలు కాస్త ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. షూటింగ్ విజువల్స్ లీక్ అవడానికి ఆస్కారమున్న మొబైల్స్ తో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ లను షూటింగ్స్ కు అనుమతించకుండా కట్టుదిట్టం చేశారట.

నిర్మాతల ప్లాన్ వర్కవుట్ అయ్యి.... హైదరాబాద్ షెడ్యూల్ కు సంబంధించి ఎటువంటి స్టిల్స్ బయటకు లీక్ అవలేదు. దీంతో.. త్వరలో స్టార్ట్ అవబోతున్న 'అబుదాబి' షెడ్యూల్ లోనూ ఇవే రూల్స్ ను స్టిక్ట్ గా అమలు చేయనున్నారట. ఇందుకోసం షూటింగ్ లొకేషన్ కు మొబైల్స్ తీసుకురావద్దని నటీనటులతో సహా యూనిట్ సభ్యులందరికీ ముందే చెపుతున్నారట.