HeadLines

పవన్, అను ఇమ్మానుయేల్ తో త్రివిక్రమ్ సెల్ఫీ


పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. అక్కడి షూటింగ్ బ్రేక్ లో పవన్, అనూ ఇమ్మాన్యుయల్ తో కలసి టీ తాగుతున్న త్రివిక్రమ్.. సరదాగా ఆ ఇద్దరితో ఓ సెల్ఫీ తీశాడు.

‘గుడ్ కంపెనీ గుడ్ వర్క్’ అంటూ ఈ ఫొటోను హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయల్ తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. ఇప్పటికే వీరి ఫారిన్ షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని లీకుడ్ ఫొటోస్ నెట్ లో సందడి చేస్తుండగా.. ఇప్పుడు హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.