HeadLines

మరో రీమేక్ సినిమాలో తమన్నా

ప్రస్తుతం హిందీ 'క్వీన్' చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తోన్న తమన్నా.. తాజాగా మరో రీమేక్ మూవీకి అంగీకరించిందట. పైగా ఇదో హిందీ సినిమా కావడం విశేషం. మూడేళ్ల క్రితం తమిళంలో వచ్చిన సిద్ధార్థ్ సినిమా 'జిగర్ థండా' ఇప్పుడు హిందీలో రీమేక్ కు రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నిర్మించనున్న ఈ సినిమాకు నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. బాలీవుడ్ లో తమన్నాకు మరో ఛాన్స్ లభించినట్టే..!