మలయాళంలోకి రానా ‘నేనే రాజు నేనే మంత్రి’
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం.. రానాకు ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా మలయాళంలో విడుదలకు సిద్ధమైంది. ‘బాహుబలి’ భారీ విజయంతో రానాకు మలయాళంలోనూ మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని ‘రాజా కిరీడం’ పేరుతో అక్కడ విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న మలయాళంలో ఈ సినిమా విడుదల అవుతోంది. ఇప్పటికే తమిళంలోనూ ఈ సినిమా విడుదలైనప్పటికీ.. ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మలయాళ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!