HeadLines

నాని 'ఎంసిఏ' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్


నేచులర్ స్టార్ నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వలో రూపొందుతోన్న చిత్రం 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి). నానికి జంటగా సాయిపల్లవి నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.న ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించగా... ఇప్పుడు టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 10న ఉదయం 10 గంటలకు 'ఎం.సి.ఏ' చిత్రం టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. డిసెంబర్ థర్డ్ వీక్ లో ఈ సినిమా విడుదల కానుంది.