HeadLines

కార్తీ 'ఖాకీ' కథ వెనకున్న అసలు ట్విస్ట్

కార్తి హీరోగా తెరకెక్కిన ‘ఖాకి’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న విడుదలవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. ఈ కథను ఏడేళ్ల క్రితమే విన్నానన్నాడు హీరో కార్తీ. గతంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’లో నటించిన కార్తీ.. ఇందులోని పోలీస్ క్యారెక్టర్ కోసం ఓ పోలీస్ ఆఫీసర్ ను కలిశాడట.

ఎటువంటి క్లూస్ లేని ఓ సీరియల్ హత్యలకు సంబంధించిన కేసును పదేళ్ల తర్వాత తాము ఎలా ఛేదించామో చెప్పాడట ఆ పోలీసాఫసర్. ఆ కేసు కార్తీని ఎంతగానో ఆశ్చర్యపరచిందట. కొన్నేళ్ల తర్వాత సరిగ్గా అదే నేపథ్యంలో కథ రాసుకొచ్చి తనకు వినిపించాడట 'ఖాకీ' దర్శకుడు వినోద్. ఆల్రెడీ ఆ కథపై తనకున్న ఆసక్తితో వెంటనే ఓకే చెప్పానన్నాడు కార్తీ. మరి.. కార్తీని అంతగా ఆశ్చర్యపరచిన ఈ 'ఖాకీ' కథ.. ప్రేక్షకులను కూడా సర్ప్రైజ్ చేస్తే బాక్సాపీస్ హిట్ లభించినట్టే.!