'కాటమరాయుడు' వచ్చేది ఆరోజే

మార్చి 24న అయితే వసూళ్ల పరంగా మరింత కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ డేట్ ను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు ఈ సినిమాపై మరింత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో పవన్ - శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మాదిరిగా, ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని భావిస్తున్నారు.