HeadLines

ఆ దర్శకుడికి సూర్య ఖరీదైన బహుమతి

కోలీవుడ్ అగ్రకథానాయకులలో అజిత్ .. విజయ్ తమ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగానే, ఆ సినిమా డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం చేస్తుంటారు. తాజాగా సూర్య కూడా అదే పనిచేశాడు. సూర్య తాజా చిత్రంగా 'సింగం 3' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా వసూళ్లు ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, తమిళంలో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

కోలీవుడ్ లోని అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సంతోషంతో పొంగిపోయిన సూర్య, దర్శకుడు హరికి ఓ ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చాడు. టయోటా ఫార్చునర్ న్యూ మోడల్ కారును హరికి బహుమతిగా అందజేశాడు. అలా ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక 'సింగం 4' కూడా వస్తుందని చెప్పిన హరి, తెలుగులో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్టుగా చెప్పాడు.