HeadLines

జోరు పెంచిన కుమారి

హెబ్బా పటేల్ దూకుడు ఎంత మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతూనే వుంది. కుమారి 21 F .. ఈడోరకం ఆడోరకం .. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలతో హెబ్బా పటేల్ విజయాలను సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ తో చేస్తోన్న మిస్టర్ .. రాజ్ తరుణ్ తో చేస్తోన్న అంధగాడు సెట్స్ పై వున్నాయి.

 ఈ సినిమాలు కాకుండా ఆమె మరో సినిమాను కూడా పూర్తి చేసే పనిలో వుంది.  పళని దర్శకత్వం వహిస్తోన్న ఆ సినిమాయే 'ఏంజెల్'. నాగ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ రోజున చివరి షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టింది. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. నాగ అశ్విన్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.