HeadLines

అఖిల్ సరసన ఆ మలయాళ భామ

అఖిల్ రెండవ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను కథానాయికగా ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. చైతూతో కలిసి 'ప్రేమమ్' హిట్ ను అందుకున్న అనుపమ, అఖిల్ తోను సినిమా చేయనుండటాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

 సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కోసం మొదట అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. ఈ కథ పల్లెటూరి నేపథ్యంలోనిది కావడం వలన, ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుందని భావించారు. ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ సమంతాను తీసుకున్నారు. ఆ ఛాన్స్  మిస్ అయినా .. అఖిల్ మూవీలో ఛాన్స్ రావడం పట్ల అనుపమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు.