HeadLines

మహేశ్ సెట్స్ లో చిరు... మళ్లీ మురుగదాస్ తో..?


మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో ప్రత్యక్షమయ్యారు మెగాస్టార్. ప్రస్తుతం మహేశ్ పై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నాడు మురుగదాస్. ఈ షూటింగ్ చూసిన చిరంజీవి.. చిత్రయూనిట్ ను అభినందించడంతో పాటు మహేశ్, మురుగదాస్ తో కాసేపు ముచ్చటించినట్టు తెలుస్తోంది.

మురుగదాస్ సినిమాలతో చిరంజీవికి ఓ అనుబంధం ఉంది. మురుగదాస్ తమిళంలో దర్శకత్వం వహించిన 'రమణ'కు తెలుగు రీమేక్ అయిన 'ఠాగూర్' లో నటించాడు చిరంజీవి. ఇక 'స్టాలిన్' సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించగా.. చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్-150'కి మాతృక అయిన 'కత్తి' చిత్రానికి మురుగదాసే దర్శకుడు.

మురుగదాస్ కథలపై ఎంతో మక్కువ చూపించే మెగాస్టార్.. తన కోసం ఓ కథ సిద్ధం చేయమని మురుగదాస్ ను కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షో షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్ గ్యాప్ లో మహేశ్ మూవీ సెట్స్ లో చిరు సందడి చేశారు.