కొత్త జానరైనా ఆదికి హిట్ ఇచ్చేనా..?

బుల్లితెర ప్రభాకర్ డైరెక్షన్
టీవీ యాంకర్ ప్రభాకర్ ఈ హారర్ థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నెలకొల్పిన వి4 మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఓ పదిరోజుల షూటింగ్ కూడా ముగించుకుందట.
కొత్త హీరోయిన్ తో...
మరాఠీ హీరోయిన్ వైభవి శాండిల్య ఈమూవీలో హీరోయిన్. ఇప్పటికే తమిళంలో సంతానం హీరోగా వచ్చిన ‘సర్వర్ సుందరం, సక్కా పోదు పోదు రాజా’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వైభవికి ఇదే తొలి తెలుగు చిత్రం. మొత్తానికి కొత్త హీరోయిన్, కొత్త జానర్ ట్రై చేస్తోన్న ఆది.. ఈ మూవీతో హిట్ గ్యారంటీ అని భావిస్తున్నాడట.